English | Telugu
అజిత్ ఫొటో షేర్ చేసిన విఘ్నేష్... భార్య కోసమేనా?
Updated : Feb 13, 2023
అజిత్ ఇప్పుడు నాన్‌స్టాప్‌గా ట్రెండింగ్ లో ఉన్నారు. సంక్రాంతి సీజన్లో తునివు సినిమాతో ట్రెండ్ అయ్యారు. ఆ తర్వాత తునివు కలెక్షన్ల టాపిక్ నడిచింది. అది కాస్త చల్లారాక ఏకే 62కి సంబంధించి వరుసగా అప్ డేట్స్ వచ్చాయి. అజిత్ హీరోగా విఘ్నేష్ డైరక్షన్లో నటించబోయే హీరోయిన్ల లిస్టు కూడా రిలీజ్ అయింది. సరిగ్గా అప్పుడే ట్విస్టు కనిపించింది. విఘ్నేష్ ఆ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలొచ్చాయి. అజిత్ - విఘ్నేష్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని అన్నారు. ఏకే62ని మగిళ్ తిరుమేని అనే డైరక్టర్ అతి త్వరలో డైరక్ట్ చేస్తారని అన్నారు. దానికి తగ్గట్టే తన మూవీస్ లిస్టు నుంచి ఏకే 62ని సోషల్ మీడియాలో అర్ధాంతరంగా తీసేశారు విఘ్నేష్ శివన్.
అంతే సంగతులు, అజిత్ మూవీ నుంచి విఘ్నష్ ఔట్. తన భర్తకు ఈ రకంగా జరిగినందుకు నయనతార అవమానం ఫీలయ్యారు. ఆమె ఇక అజిత్ సినిమాలో నటించనని శపథం చేశారట. తనకు తెలిసినవారితో అజిత్ సినిమా కోసమైతే తనను అప్రోచ్ కావాల్సిన పనిలేదని చెప్పేశారట అంటూ వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, ఒక్క ఫొటోతో అందరికీ చెప్పేశారు విఘ్నేష్ శివన్. అజిత్ నవ్వుతూ వీడియో కాల్ మాట్లాడుతున్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు విఘ్నేష్. అజిత్ కీ, తనకూ ఎలాంటి విభేదాలు లేవని ఆ పోస్టుతో చెప్పకనే చెప్పేశారు.అయితే అజిత్ సినిమాను తాను డైరక్ట్ చేస్తున్నారా? లేదా? అనే విషయం మీద మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ
అయితే ఇవ్వలేదు విఘ్నేష్.
అజిత్ మూవీ కారణంగా, తన వల్ల తన వైఫ్ ఇబ్బంది పడటాన్ని చూడలేక విఘ్నేష్ చేసిన ఈ పనిని చూసి అతన్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అన్నిటికీ మాటలతో సమాధానం చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడూ ఇలా అద్భుతంగా రియాక్ట్ కావచ్చు. అది విఘ్నేష్‌కే సాధ్యం అని అంటున్నారు సూపర్‌స్టార్ అభిమానులు.