English | Telugu
ఇంతకీ శ్రీలీలను త్రివిక్రమ్ ఏం చేయనున్నాడు?!
Updated : Feb 13, 2023
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే ఇద్దరు హీరోయిన్లు కచ్చితంగా ఉంటారు. ఇక హీరో హీరోయిన్ల తో పాటు మరో బలమైన పాత్ర ఉంటుంది.అది అత్త , అమ్మమ్మ, తాత, వదిన ఇలా ఎవరైనా కావచ్చు. అయితే త్రివిక్రమ్ సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించేవారు మాత్రం రాణించలేకపోతున్నారు. ఆయన సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తే వారికి ఇక కాలం కలిసి రావడం లేదు. ఈ విషయం ఇప్పటికే పలుసార్లు నిరూపితం అయింది. అత్తారింటికి దారేదిలో ప్రణీత, సన్నాఫ్ సత్యమూర్తి లో నిత్యామీనన్, అ ఆ లోఅనుపమ పరమేశ్వరన్, అజ్ఞాతవాసిలో అను ఇమ్మానుయేల్, అరవింద్ సమేత వీర రాఘవలో ఈషారెబ్బా, అలా వైకుంఠపురంలో నివేదిత పేతురాజ్ వంటి వారందరూ కూరలో కరివేపాకుల మారిపోయారు.
ఇక ప్రస్తుతం మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో పూజ హెగ్డే తో పాటు పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కానీ సెకండ్ హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. ఇద్దరు హీరోయిన్లకు సమానమైన ప్రాధాన్యం ఉంటుందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా త్రివిక్రమ్ సినిమాలో గనుక శ్రీ లీల పాత్ర కూరలో కరివేపాకు మాదిరిగా ఉంటుందేమోనని ఇప్పటికీ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి సందడితో పరిచయమై ఆ తరువాత ధమాకా తో శ్రీ లీల మంచి పేరు తెచ్చుకుంది. జాగ్రత్తగా అడుగులు వేస్తే రాబోయే కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఈమె ఎదిగే అవకాశం ఉంది. రవితేజకు జోడిగా నటించిన ధమాకా చిత్రంలో కూడా ఈమె డాన్స్ కు అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మంచి పాత్రలో ఫుల్ లెన్త్ ఉన్న పాత్రలో ఆమెని చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మహేష్ బాబు సినిమాలో శ్రీలీలని చిన్న పాత్రలో చూపిస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాలో శ్రీలీలకు పూజా హెగ్డే తో సరి సమానమైన ప్రాధాన్యం ఉంటుందని నిర్మాత మరీ మరీ చెబుతున్నారు. నిజంగానే శ్రీలీలా పాత్ర అంత ప్రాధాన్యత ఉంటే ఆమె కెరీర్ టర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ మాత్రం సెకండ్ హీరోయిన్ అయితే మాత్రం ఆమె బ్యాక్ టర్న్ తీసుకున్న ఆశ్చర్యం లేదు.