English | Telugu

తైవాన్‌కి వెళ్తున్న ఇండియ‌న్‌2 యూనిట్‌

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టిస్తున్న సినిమా ఇండియ‌న్‌2. రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం తెర‌కెక్కిన ఇండియ‌న్ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా యూనిట్ ఏప్రిల్ ఒక‌టిన తైవాన్‌కు వెళ్ల‌నుంది. క‌మ‌ల్‌హాస‌న్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ర‌వివ‌ర్మ కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్‌, లైకా సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. కాజల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, సిద్ధార్థ్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహా, ఢిల్లీ గ‌ణేష్ తో పాటు ప‌లువురు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జ‌రుగుతోంది.

ఈ చిత్రంలోని కీల‌క స‌న్నివేశాల కోసం చిత్ర బృందం తైవాన్‌కి షిఫ్ట్ అవుతోంది. ఏప్రిల్ ఒక‌ట‌వ తేదీని తైవాన్‌కి వెళ్తున్నారు. అక్క‌డ నాలుగు రోజులు షూటింగ్ ఉంటుంది. ఆ వెంట‌నే సౌత్ ఆఫ్రికాకు కూడా వెళ్తారు. కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను అక్క‌డ చిత్రీక‌రిస్తారు. దీనికోసం 20 రోజులు అక్క‌డ స్టే చేయ‌నున్నారు క‌మ‌ల్, శంక‌ర్ అండ్ టీమ్‌. ఏప్రిల్ ఆఖ‌రున చెన్నైకి షిఫ్ట్ అవుతారు.

క‌మ‌ల్ హాస‌న్‌కి లోకేష్ క‌న‌గ‌రాజ్ రీసెంట్‌గా హిట్ ఇచ్చారు. ఆ వేడి చ‌ల్లార‌క‌ముందే మ‌రో సినిమాను రిలీజ్ చేయాల‌న్న‌ది క‌మ‌ల్ ప్లాన్‌. అందుకే మొద‌లై ఆగిపోయిన ఇండియ‌న్‌2ని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించారు. ఆల్రెడీ రామ్‌చ‌ర‌ణ్‌తో షూటింగ్ చేస్తున్న శంక‌ర్ కాల్షీట్స్ అడ్జ‌స్ట్ చేయించి మ‌రీ ఇండియ‌న్‌2ని సెట్స్ మీద పెట్టారు. రామ్‌చ‌ర‌ణ్ ఈ మ‌ధ్య కాలంలో ఫారిన్ ట్రిప్‌, ఆస్కార్ వేడుక‌లంటూ షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వ‌డంతో, ఆ కాల్షీట్‌ని ఇలా యుటిలైజ్ చేసుకున్నారు శంక‌ర్‌. నార్త్ ఇండస్ట్రీ మీద ఫోక‌స్ చేసిన ర‌కుల్ ప్రీత్‌సింగ్‌కి సౌత్‌లో ఇండియ‌న్‌2 చాలా క్రూషియ‌ల్ సినిమా. ఈ సినిమా స‌క్సెస్ అయితే, మ‌ళ్లీ సౌత్‌లోనూ హ్యాపీగా ఓ రౌండ్‌కి వ‌చ్చేయొచ్చ‌ని భావిస్తున్నారు ర‌కుల్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.