English | Telugu

కమర్షియల్ జపం చేస్తున్న కుర్ర హీరో!

ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఎక్కువగా విభిన్న చిత్రాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక యంగ్ హీరో మాత్రం కమర్షియల్ జపం చేస్తున్నాడు. ఆ కుర్ర హీరో ఎవరో కాదు కిరణ్ అబ్బవరం. కిరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'మీటర్'. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రమేష్ కాడూరి దర్శకుడు. ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశాడు మేకర్స్. ఆ ట్రైలర్ చూస్తుంటే స్టార్ హీరో నటించిన పక్కా కమర్షియల్ సినిమా ట్రైలర్ లా అనిపిస్తోంది.

'మీటర్' ట్రైలర్ ను బుధవారం ఉదయం విడుదల చేశాడు. ఈ చిత్రంలో కిరణ్ పోలీస్ గా కనిపిస్తున్నాడు. అదిరిపోయే ఫైట్లు, పంచ్ డైలాగ్స్, మాస్ స్టెప్పులు, రొమాంటిక్ సీన్స్ తో ట్రైలర్ కమర్షియల్ ప్యాకేజ్ లా ఉంది. ముఖ్యంగా కిరణ్ యాటిట్యూడ్, ఎలివేషన్ షాట్స్, భారీ ఫైట్లు, మాస్ వార్నింగ్ లు స్టార్ హీరోల సినిమాలను తలపిస్తున్నాయి. మరి ఈ పక్కా కమర్షియల్ ఫిల్మ్ తో కుర్ర హీరో కిరణ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

అతుల్య రవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి కార్తీక్, సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ సి. దిలీప్ వ్యవహరిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.