English | Telugu

రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?

శివాజీ వర్సెస్ అనసూయ
వివాదంలోకి ప్రముఖ నటి రాశి
తప్పు శివాజీదా? అనసూయదా?
రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ?
అనసూయ క్షమాపణలు చెప్పక తప్పదా?

కొద్దిరోజులుగా శివాజీ వర్సెస్ అనసూయ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. 'దండోరా' మూవీ ఈవెంట్ లో హీరోయిన్ల వస్త్రధారణ గురించి శివాజీ మాట్లాడాడు. బయటకు వచ్చేటప్పుడు పద్ధతిగా డ్రెస్ చేసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో ఆయన రెండు మూడు పదాలు దొర్లాడు. ఆ విషయాన్ని గ్రహించిన శివాజీ.. తాను ఉపయోగించిన సామాన్లు వంటి పదాల విషయంలో వెంటనే క్షమాపణలు చెప్పాడు. కానీ, వస్త్రధారణ విషయంలో తన స్టేట్ మెంట్ కి మాత్రం కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చాడు. (Sivaji vs Anasuya)

శివాజీ చెప్పిన విధానం తప్పు కానీ, చెప్పిన విషయం కరెక్ట్ అంటూ పలువురు ఆయనకు మద్దతుగా నిలిచారు. అనసూయ వంటి వారు మాత్రం.. స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడటానికి ఆయన ఎవరంటూ ఫైర్ అయ్యారు. దీంతో ఈ వివాదం శివాజీ వర్సెస్ అనసూయగా మారింది. కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తే.. మరికొందరు అనసూయకి సపోర్ట్ గా మాట్లాడారు.

తర్వాత ఈ వివాదం పలు మలుపులు తీసుకొని.. అనసూయపై ట్రోల్స్ కి దారితీసింది. తన కొడుకే తన డ్రెస్సింగ్ స్టైల్ బాలేదని అన్నాడని ఒక ఇంటర్వ్యూలో అనసూయ చెప్పిన క్లిప్ ని వైరల్ చేశారు నెటిజెన్లు. అలాగే, జబర్దస్త్ వంటి టీవీ షోలలో అనసూయ మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగులను కూడా వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా రాశి ఫలాలకు బదులుగా 'రాశి గారి ఫలాలు' అని ఒక స్కిట్ లో అనసూయ చెప్పిన డైలాగ్ ని వైరల్ చేస్తూ.. అప్పుడు ఒక స్త్రీని ఇలా అనడం తప్పనే విషయం గుర్తుకు రాలేదా? అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.

"రాశి గారి ఫలాలు" అనే డైలాగ్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా నటి రాశి(Raasi) స్పందించారు. "శివాజీ గారు మాట్లాడినది తప్పని నేను అనను. పైగా ఆ రెండు మూడు పదాలు వాడటం తప్పని.. ఆయనే ఒప్పుకొని సారీ కూడా చెప్పారు. ఇప్పుడు నేను శివాజీ గారి గురించి మాట్లాడను కానీ.. ఈ ఇష్యూలో నా పేరు వచ్చింది కాబట్టి, దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను." అంటూ రాశి ఒక వీడియో బైట్ ని విడుదల చేశారు.

"నాలుగైదేళ్ల క్రితం ఒక టీవీ షో స్కిట్ లో నా పేరుపై ఓ డైలాగ్ చెప్పారు. స్కిట్ లో రాశి ఫలాలు అనే పదం రాగా.. ఆ షో యాంకర్ ఒక లేడీ అయ్యుండి కూడా 'రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా?' అని అడిగింది. అసలు అలా ఎలా అడుగుతుంది. అలాంటి ఆమె ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. ఆ స్కిట్ టైములో అక్కడున్న లేడీ జడ్జి కూడా గట్టిగా నవ్వేసింది. నేను ఆ ప్లేస్ లో ఉంటే నవ్వేదాన్ని కాదు.. వెంటనే ఆ స్కిట్ ని ఆపేసేదాన్ని. కామెడీ చేయొచ్చు.. కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్నతల్లికి, కన్న తండ్రికి కూడా రైట్ లేదు." అంటూ రాశి చురకలు వేశారు.

"నేను అందరికీ ఒకటే చెప్తున్నాను. ప్రశాంతంగా ఉండండి. ఎందుకు అనవసరమైన టాపిక్స్. సోషల్ మీడియాను ఒక మంచి ప్లాట్ ఫామ్ గా ఉపయోగించండి. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేసి బ్యాడ్ చేయకండి. మీ ఫ్యామిలీని చూస్కోండి, మీ ఫ్రెండ్స్ ని చూస్కోండి. నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, నచ్చకపోతే మాట్లాడటం మానేయండి. అంతేకానీ ఖాళీగా ఉన్నాం కదా అని.. ఎవర్ని ఏమందాం, ఎవర్ని ట్రోల్ చేద్దాం అని చూడకండి. ఇక్కడ ఎవరికీ ఎవరినీ అనే రైట్ లేదు. అసలు దీనిని నేను లీగల్ ఇష్యూ చేద్దామనుకున్నా. అప్పుడు అమ్మ ఒకటి అడిగారు.. అసలు నీకు కరెక్ట్ గా ఏం కావాలని?. దానికి నా దగ్గర సమాధానం లేదు. అందుకే ఈ వీడియో చేశాను. అందరూ హ్యాపీగా ఉండండి" అంటూ రాశి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రాశి వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా హుందాగా స్పందించారు అంటూ నెటిజెన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో.. ఇప్పటికైనా రాశికి అనసూయ క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అనసూయ స్పందిస్తుందో లేదో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.