English | Telugu
చైతూతో డిజాస్టర్.. మరి నాగ్ తో..?
Updated : Aug 29, 2023
గత ఏడాది బంగార్రాజు, బ్రహ్మాస్త్ర, ది ఘోస్ట్ చిత్రాలతో పలకరించారు కింగ్ నాగార్జున. వీటిలో ది ఘోస్ట్ నిరాశపరిచగా, మిగిలిన రెండు సినిమాలు మంచి ఫలితాన్నే అందించాయి. అయితే, ఈ సంవత్సరం మాత్రం ఇప్పటివరకు కొత్త సినిమాతో పలకరించలేదు. ఇంకా చెప్పాలంటే.. ఈ క్యాలెండర్ ఇయర్ లో నాగ్ నుంచి దాదాపుగా పిక్చర్ లేనట్టే.
అయితే, వచ్చే ఏడాది సంక్రాంతికి నాగ్ నుంచి మాంచి మాస్ ఎంటర్టైనర్ రాబోతోంది. అదే.. నా సామి రంగ. ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగ్ కి కలిసొచ్చిన సంగీత దర్శకుడు కీరవాణి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి స్వరకర్త. ధమాకా రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ కథ, మాటలు అందిస్తున్నారు.
ఇక, నా సామి రంగ నిర్మాత విషయానికి వస్తే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆయన గతంలో నాగచైతన్యతో కస్టడీ వంటి డిజాస్టర్ ని నిర్మించారు. మరి.. చైతూకి అచ్చిరాని ఈ సంస్థ నాగ్ విషయంలోనైనా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.