English | Telugu
పవన్ కళ్యాణ్ సింగర్‌కి పెళ్లి ఫిక్సయింది
Updated : Aug 29, 2023
పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ గుర్తుందా? అందులో కంటిపాపా కంటిపాపా అనే పాట గుర్తుందా? ఆ పాటను పాడిన సింగర్ పేరు గుర్తుందా? యస్... అతనే అర్మాన్ మాలిక్. ఆయనకు పెళ్లి ఫిక్స యింది. ఆయన చిరకాల స్నేహితురాలు ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయన్సర్ ఆష్నా ష్రాఫ్‌ని వివాహం చేసుకోబోతున్నారు. సోమవారం వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగింది.
ఈ విషయాన్ని అర్మాన్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ లో అనౌన్స్ చేశారు. తన ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి కేండిడ్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు. ఆ పిక్స్ తో పాటు ``మా సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడే మొదలైంది`` అని రాశారు. ప్రేమ సింబల్స్ కూడా షేర్ చేశారు.
అర్మాన్ తమ పెళ్లి గురించి చెప్పగానే, పాపులర్ సెలబ్రిటీలు ఈషా గుప్తా, జరీన్ ఖాన్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, ఇషాన్ కట్టర్ ఇద్దరికీ విషెస్ చెప్పారు.
ఆష్నా కూడా తన డ్రీమీ ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేశారు. నీ నమ్మకం, నీ మీదనాకు నమ్మకాన్ని క్రియేట్ చేసింది అంటూ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేసింది.
ఈషా గుప్తా కూడా రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశారు. దివ్యాంప త్రిపాఠీ కంగ్రాజులేషన్స్ చెప్పారు. ఇద్దరికీ ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని ఆశీర్వదించారు. సింగర్ హర్షదీప్ కౌర్ కూడా సంతోషంగా ఉండమని శుభాకాంక్షలు చెప్పారు.
ఆష్రా ష్రాఫ్
ఆష్రా ష్రాఫ్ యంగ్ యూట్యూబర్. ఫ్యాషన్, బ్యూటీ ఇన్‌ఫ్లుయన్సర్. ఆమెకు ఈ ఏడాదికిగానూ కాస్మోపాలిటన్ లగ్జరీ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయన్సర్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపు దక్కింది.
అర్మాన్ మాలిక్
అర్మాన్ మాలిక్ ఇండియన్ ఓకలిస్ట్. పాటలు రాస్తారు. రికార్డ్ ప్రొడ్యూసర్. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. పెర్ఫార్మర్. యాక్టర్. హిందీ, తమిళ్, తెలుగు, గుజరాతీ, ఉర్దూ, మలయాళం, బెంగాలీ, కన్నడలో చాలా పాటలు పాడారు. ఎంఎస్ ధోనీతో పాటు పలు సినిమాల్లో హిట్ సాంగ్స్ పాడారు అర్మాన్.