English | Telugu
అప్పుడు లారెన్స్.. ఇప్పుడు విజయ్..
Updated : Aug 29, 2023
కొత్త దర్శకులను పరిచయం చేయడంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అప్పటి రామ్ గోపాల్ వర్మ నుంచి నిన్నటి కళ్యాణ్ కృష్ణ వరకు డెబ్యూ డైరెక్టర్స్ తో మెమరబుల్ హిట్స్ కొట్టారు నాగ్. కట్ చేస్తే.. త్వరలో నాగార్జున మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. అతడే.. విజయ్ బిన్ని. ఇంతకీ ఈ విజయ్ బిన్ని ఎవరంటే.. ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్. నాగ్ 99వ చిత్రం నా సామి రంగతో విజయ్ దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. దాదాపు 20 ఏళ్ళ క్రితం మాస్ (2004) చిత్రంతో కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవకి దర్శకుడిగా తొలి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున. తనే స్వయంగా నిర్మించిన సదరు చిత్రం బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించింది. మరి.. 2024 సంక్రాంతికి రాబోతున్న నా సామి రంగతోనూ కొరియోగ్రాఫర్ విజయ్ అదిరిపోయే హిట్ కొడతాడేమో చూడాలి.
కాగా, నా సామి రంగకి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.