English | Telugu
600 కోట్లను దాటిన జైలర్.. వారెవా తలైవా!
Updated : Aug 29, 2023
రజనీకాంత్ మాసివ్ హిట్ జైలర్ సినిమా కొత్త మైల్‌స్టోన్‌ని టచ్ చేసింది. ఈ సినిమా ఇప్పుడు 600 కోట్లను దాటి కలెక్ట్ చేస్తోంది. జైలర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 607.29 కోట్లు వచ్చాయన్నది ట్రేడ్ పండిట్స్ సమాచారం. ఈ యాక్షన్ సినిమాకు డొమెస్టిక్‌గా 315.95 కోట్లు వచ్చాయి. ఆదివారం అన్నీ భారతీయ భాషల్లో కలిపి 7.5కోట్లు కలెక్ట్ చేసింది.
జైలర్ చిత్రాన్ని తమిళ్‌లో తెరకెక్కించారు. హిందీ, తెలుగు, కన్నడలో ఆగస్టు 10న విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన 18వ రోజు 600 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది. తమిళ సినిమాలలో 2018లో విడుదలైన 2.0 మాత్రమే ఈ రికార్డు క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత ఈ క్లబ్‌లో ఎంటర్ అయిన సినిమా ఇదే. కాబట్టి, మొదటి రెండు ప్లేసుల్లో ఉన్నారు తలైవర్.
జైలర్ సినిమాకు మూడో సోమవారం కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లు కనిపించాయి. ఆదివారం రోజు థియేటర్లన్నీ కిటకిటలాడాయి. ఆ క్రేజ్ వల్లనే 600 కోట్ల క్లబ్‌లోకి 18వ రోజు చేరడం సాధ్యమైంది. జైలర్ సినిమాకు మొదటివారం 450 కోట్లు వచ్చాయి. రెండో వారం 124.18 కోట్లు వచ్చాయి. మూడో వారం టోటల్ గ్రాస్ 607.29 కోట్లుగా ఉంది.
జైలర్ గురించి...
రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. వసంత్ రవి, తమన్నా భాటియా, యోగిబాబు, రమ్యకృష్ణన్, వినాయకన్ కీలక పాత్రల్లో నటించారు. జైలర్ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించారు. మలయాళ వెటరన్ యాక్టర్ మోహన్‌లాల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. హిందీ నుంచి జాకీ ష్రాఫ్ నటించారు. తెలుగు ఆర్టిస్ట్ సునీల్ కూడా కీ రోల్ చేశారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి పెద్ద కొడుకు చేసిన కేరక్టర్‌కి మంచి పేరు వచ్చింది.