English | Telugu
ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే స్ట్రీకింగ్ చేస్తానంటున్న నటి
Updated : Nov 16, 2023
మాంగల్యం, దామిని విల్లా ,కళాయా తస్మే నమహా, కాత్సాయని, స్వాతి చినుకు,రంగీలా లాంటి పలు సినిమాల్లో నటించిన నటి రేఖా భోజ్.అన్ని సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపుని సోషల్ మీడియా ద్వారా రేఖా భోజ్ పొందింది. సోషల్ మీడియాలో ఆమెకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆమె తాజాగా వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానని చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది.
ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే కనుక వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానని రేఖా భోజ్ అంటుంది. ఇంతకీస్ట్రీకింగ్ అంటే ఏమిటి అని అనుకుంటున్నారా.. స్ట్రీకింగ్ అంటే ఎవరికైనా పట్టరాని ఆనందం వచ్చినప్పుడు ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా పరుగెత్తడం. పాశ్చ్యాత దేశాల్లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రేఖా భోజ్ ఈ విషయం చెప్పేసరికి ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. కొంత మంది అయితే ఆమెని తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
కాకపోతే ఇప్పుడు ఆమె తాజాగా మళ్ళీ తన ఇనిస్ట్రా లో ఒక పోస్ట్ చేసింది. స్ట్రీకింగ్ అంటే నా దృష్టిలో సడెన్ గా వచ్చే ఉద్వేగంతో మనం ఏ స్థితిలో ఉన్నామో అనే సంగతిని కూడా మర్చిపోయి ఆనందంతో రన్నింగ్ చేయడం అని చెప్పుకొచ్చింది .ఇప్పడు ఈ వార్తని సోషల్ మీడియా లో చూసిన చాలా మంది రేఖా భోజ్ సెన్సేషనల్ అవ్వడం కోసమే ఇండియా గెలిస్తే స్ట్రీకింగ్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఏం తెలియని నంగనాచిలా మాట్లాడుతుందని అంటున్నారు.