English | Telugu

పార్కింగ్‌ కోసం హత్యలా.. కొత్త పాయింట్‌తో సరికొత్త సినిమా!

అద్దె ఇంట్లో నివసించేవారికి నిత్యం ఎదురయ్యే సమస్య పార్కింగ్‌. ఈ సమస్యను ఎదుర్కోని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అలాంటి ఇబ్బంది పడినవారే. అలాంటి ఓ కథాంశంతో రూపొందిన సినిమా ‘పార్కింగ్‌’. తన వాహనాన్ని ఎక్కవ పార్క్‌ చేయాలి.. ఆ స్థలం కారణంగా చెలరేగిన వివాదం ఎలాంటి పరస్థితులకు దారి తీసింది? వంటి ఆసక్తికర అంశాలతో రూపొందిన సినిమా ‘పార్కింగ్‌’. ఈ సినిమా డిసెంబర్‌ 1న విడుదల కాబోతోంది. హరీష్‌ కళ్యాణ్‌, ఇందుజ జంటగా నటించిన ఈ సినిమాకి రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకుడు.

ఈ సినిమా గురించి దర్శకుడు తెలియజేస్తూ ‘నగరాల్లో పార్కింగ్‌ అనేది పెద్ద సమస్య. దానివల్ల ఎన్నో వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా జరగడం మనం వార్తల్లో చూస్తుంటాం. యదార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. దానికి కొంత హ్యూమన్‌ టచ్‌ను కూడా జోడిరచి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం జరిగింది. ఒక సమస్య ఉత్పన్నమైతే ఒక్క క్షణం మానవత్వంతో ఆలోచిస్తే దానికి పరిష్కారం కూడా లభిస్తుంది. ఈ చిత్రంలోని ప్రధానాంశం ఇదే. ఈ సినిమా షూటింగ్‌ 36 రోజుల్లో పూర్తి చేశాం. ఎక్కువ భాగం చెన్నై వలసరవాక్కం, విల్లివాక్కంలలో చిత్రీకరించగా, కొన్ని సన్నివేశాలను ఈసీఆర్‌లో షూట్‌ చేశాం. ఆద్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగే ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది’ అన్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.