English | Telugu

విజయకాంత్‌ ఆరోగ్యం విషమం.. ఆందోళనలో అభిమానులు!

నారాయణన్‌ విజయ్‌రాజ్‌ అళగర్‌స్వామి... ఈ పేరు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ, విజయ్‌కాంత్‌ అంటే ఠక్కున అందరికీ గుర్తొస్తుంది. యాక్షన్‌ హీరోగా తమిళ్‌, తెలుగు భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్‌ హీరోగానే కాదు, రాజకీయ నాయకుడిగా కూడా తన ముద్రను వేశారు. ఒకప్పుడు కోలీవుడ్‌లో ఎంతో మంది అభిమానులను పొందిన హీరో విజయ్‌ కాంత్‌. ఆయన ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు ప్రాణం పోశారు. లక్షల మంది అభిమానులను సంపాదించాడు. ఇక సినిమాలు వదిలి.. ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన డీఎండీకేను స్థాపించారు. విజయ్‌కాంత్‌ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడం తర్వాత కోలుకోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి విజయ్‌కాంత్‌ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది.విజయ్‌కాంత్‌ ఆరోగ్యం విషమించడంతో ఆయన అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో విజయ్‌ కాంత్‌ హాస్పిటల్‌లో చేరినట్టు సమాచారం. సాధారణ వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను ఒక రోజు అబ్జర్వేషన్‌లో ఉంచారట డాక్టర్లు. చాలా కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు విజయ్‌కాంత్‌. ఈ కారణంతోనే ఆయన మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా విజయ్‌కాంత్‌ వీల్‌ చైర్‌లోనే వెళ్తుంటారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న విజయకాంత్‌ తమిళ సినీ పరిశ్రమపై తనదైన ముద్రను వేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో అడుగుపెటి దేశీయ ముర్పోక్కు ద్రావిడ కలగం ను స్థాపించారు. తమిళ నటుడు, నటీనటుల సంఘానికి అధ్యక్షుడుగా కూడా విజయకాంత్‌ పనిచేశారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మయత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.