English | Telugu
నిజ జీవితంలో హీరో అయిన విలన్ కుమారుడికి షమీ క్రికెట్ కోచింగ్!
Updated : Nov 19, 2023
భారత జట్టులో సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న షమీ ఓ నటుడి కుమారుడికి క్రికెట్ కోచింగ్ ఇస్తున్నాడు.ప్రముఖ నటుడు సోనూసూద్ కుమారుడు అయాన్‌కు షమీ క్రికెట్ పాఠాలు చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోనూసూద్ షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. తన చిన్న కుమారుడు అయాన్‌కు షమీ బ్యాటింగ్ మెళకువలు నేర్పుతున్నట్లు వీడియోలో తెలియజేశాడు సోనూ సూద్. అయాన్‌కు క్రికెట్‌లో కోచింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సోను షేర్ చేసిన వీడియో పాతది. మూడేళ్ళ క్రితం అయాన్‌కు షమీ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచకప్‌లో షమీ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్‌తో నా కుమారుడు అయాన్‌కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్‌ను ట్యాగ్ చేశాడు.
విలన్‌గా ఎన్నో సినిమాల్లో రాణించిన సోనూ సూద్ నిజ జీవితంలో మాత్రం హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కరోనా సమయంలో సోను చేసిన సేవా కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోలేనివి. ఇప్పటికీ ఎవరైనా సాయం కోరి వస్తే కాదనకుండా తన చేతనైనంత సహాయం అందిస్తున్న సోనుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సోను చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే.. బాలీవుడ్‌లో ‘ఫతే’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్‌తో కలిసి రూపొందించిన ‘ఫతే’ మూవీ 2024లో విడుదల కానుంది.