English | Telugu

మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ్‌... ఇబ్బందుల్లో తాప్సీ!

తాప్సీ ప‌న్ను త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశార‌ని కంప్ల‌యింట్ ఫైల్ అయింది. మ‌త‌ప‌రమైన సెంటిమెంట్స్ ని హ‌ర్ట్ చేసినందుకు గతంలో ప‌లువురు సెల‌బ్రిటీల‌కు ఇబ్బందులు త‌ప్ప‌లేదు. లేటెస్ట్ గా ఆ లిస్టు తాప్సీ ప‌న్ను పేరు కూడా చేరింది. ఇటీవ‌ల ఓ ఫ్యాష‌న్ షోలో పాల్గొన్నారు తాప్సీ. ముంబైలో జ‌రిగిన ఈ ఫ్యాష‌న్ షో ఇప్పుడు తాప్సీకి తంటాలు తెచ్చిపెట్టింది. హింద్ ర‌క్ష‌క్ సంఘ‌ట‌న్ స‌భ్యుడు ఏక‌ల‌వ్య‌సింగ్ తాప్సీ మీద కేసు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ త‌న‌యుడు ఏక‌ల‌వ్య‌. టెంపుల్ జువెల‌రీలో ల‌క్ష్మీ లాకెట్‌ని తాప్సీ ధ‌రించిన తీరు ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు ఏకల‌వ్య‌.

ర్యాంప్ వాక్‌లో గ్లామ‌ర్ డ్ర‌స్ వేసుకుని, ల‌క్ష్మీ లాకెట్ ఎందుకు ధ‌రించాల్సి వ‌చ్చిందంటూ కేస్ ఫైల్ చేశారు. మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని చెప్పారు ఏక‌ల‌వ్య‌. ర్యాంప్ మీద తాప్సీ ప‌న్ను రెడ్ గౌన్‌లో క‌నిపించారు. మోడ్ర‌న్ ఔట్‌ఫిట్‌కి నెక్‌పీస్‌గా టెంపుల్ జువెల‌రీ ఎంపిక చేసుకున్నారు తాప్సీ. ల‌క్ష్మీదేవి లాకెట్‌ని ఆమె ధ‌రించిన తీరు ప‌ట్లే ఇప్పుడు అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీని గురించి తాప్సీ ఇంకా స్పందించ‌లేదు. ఎప్పుడు ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదురైనా త‌న‌దైన జ‌వాబుతో సిద్ధంగా ఉంటారు తాప్సీ. కానీ ఈ ఇష్యూ మీద ఆమె ఇంకా మాట్లాడ‌క‌పోవ‌డంతో, ఆలోచ‌న‌లో ప‌డ్డారేమో అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఫ్యాష‌న్ ప‌ట్ల ఎంత మ‌మకారం ఉన్న‌ప్ప‌టికీ, కొన్ని విష‌యాల గురించి సెల‌బ్రిటీలు అవ‌గాహ‌న పెంచుకోవాల‌నే స‌ల‌హాలు అందుతున్నాయి నెట్టింట్లో. తాప్సీ చేతిలో ప్ర‌స్తుతం హ‌సీనా దిల్‌రుబా2 సినిమా ఉంది. డంకీలోనూ కీ రోల్ చేస్తున్నారు తాప్సీ. రాజ్‌కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో షారుఖ్ న‌టిస్తున్న సినిమా డంకీ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.