English | Telugu
సురేఖ వాణి ,కూతురు కలిసి ఇంత పని చేశారేంటి
Updated : Dec 3, 2023
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటినుంచో క్యారెక్టర్ రోల్స్ చేస్తు తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్య సినిమాలు తగ్గినా కూడా తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మాత్రం రకరకాల రీల్స్ చేస్తు లేటు వయసులోను చిచ్చరపిడుగుల చెలరేగుతు దట్ ఈజ్ సురేఖ వాణి అని అందరు అనుకునేలా చేస్తుంది. తగ్గేదేలే అనే రేంజ్ లో ఉండే సురేఖ తాజాగా తూచ్ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
మొన్న జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన పలువురు అభిమానులు ఆ పార్టీ గెలుపుని కోరుకుంటు బిఆర్ఎస్ పార్టీ సింబల్ అయిన కారు ముందు నుంచొని కారు గుర్తుకి ఓటు వెయ్యాలని రీల్స్ చేసారు. ఆలా చేసిన వారిలో సురేఖ కూడా ఉంది.ముఖ్యంగా సుప్రీత కారు ముందు నిలబడి కారు గుర్తుకి ఓటు వెయ్యాలని కోరింది. పైగా తను చేసిన ఆ రీల్ ని సోషల్ మీడియాలో అప్ లోడ్ కూడా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోవడంతో బిఆర్ఎస్ రీల్ తీసేసి రేవంత్ రెడ్డి తో తను తన కూతురు కలిసి దిగిన పిక్ ని సురేఖ తన ఇనిస్టాగ్రమ్ లో అప్ లోడ్ చేసింది.
ఇప్పుడు ఈ పిక్ చూసిన వాళ్ళందరు ఇదేంటి సురేఖ వాణి ఇలా ప్లేట్ పిరాయించిందని అనుకుంటున్నారు. సురేఖ వాణి తన భర్త నుంచి విడాకులు తీసుకొని కూతురు తో కలిసి ఉంటుంది. ఇద్దరు కలిసి పొట్టి పొట్టి డ్రెస్ లతో వీడియోలు చేస్తు సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటూ చాలా మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు..మొన్నీ ఈ మధ్య బాగా డబ్బు ఉన్నవాడు దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని సురేఖ వాణి చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అలాగే ఇటీవల తల్లి కూతుళ్లు డ్రగ్స్ ఆరోపణలని కూడా ఎదుర్కొన్నారు.