English | Telugu
‘అనసూయా.. ‘యానిమల్’ సినిమాపై స్పందించవా.. ప్రశ్నిస్తున్న నెటిజన్లు!
Updated : Dec 3, 2023
బుల్లితెరను వదిలి సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేస్తున్న అనసూయ ఇప్పుడు నటిగా బిజీ అయిపోయింది. రంగస్థలం, పుష్ప, క్షణం వంటి సినిమాల్లో ఆమె చేసిన క్యారెక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది. ఇటీవల పెదకాపు సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. ప్రస్తుతం పుష్ప2 చిత్రంతోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. టీవీ షోస్‌తో, సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ అభిమానుల్ని అలరించే అనసూయ అప్పుడప్పుడు పోస్ట్ చేసే ఫోటోలకు యూత్ ఫిదా అయిపోతారు. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్‌లో ఉండే అనసూయ ఇటీవల ఓ పోస్ట్ పెట్టింది. ‘నేను వండర్ ఉమెన్’ అంటూ అనసూయ పెట్టిన క్యాప్షన్‌తో ఇప్పుడు నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె పెట్టిన పోస్ట్‌తో సంబంధం లేకపోయినా కావాలని ‘యానిమల్’ సినిమాను లింక్ చేస్తూ రకరకాల కామెంట్స్‌తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. గతంలో విజయ్ దేవరకొండను టార్గెట్ రకరకాల కామెంట్స్ పెటింది అనసూయ. అతను చేసిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాపై విమర్శల వర్షం కురిపించింది. ఆ సినిమాలోని డైలాగ్స్, సీన్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. విజయ్ దేవరకొండపై కూడా పలు కామెంట్స్ పెట్టింది. అప్పట్లో అదో పెద్ద వివాదంగా మారింది. విజయ్ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసింది. ఇదిలా ఉంటే సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ డిసెంబర్ 1న విడుదలైంది. ఈ సినిమా చాలా అసభ్యకరమైన సన్నివేశాలు, బూతు డైలాగులు ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. దీంతో నెటిజన్లు అనసూయని ఈ వివాదంలోకి లాగుతూ.. ‘యానిమల్’ సినిమా చూడలేదా.. ఇందులో కూడా అసభ్యకరమైన సన్నివేశాలు, బూతులు ఉన్నాయి. మరి దీనిపై స్పందించవా? అని నెటిజన్లు అనసూయను ప్రశ్నిస్తున్నారు. ‘విజయ్ దేవరకొండ సినిమా అయితేనే రెచ్చిపోతుంది అనసూయ. మిగతా వాళ్ళని పట్టించుకోదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో తన గురించి ఎవరు కామెంట్ చేసినా వెంటనే స్పందించి తగిన రిప్లయ్ ఇచ్చే అనసూయ ‘యానిమల్’ విషయంలో నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి.