English | Telugu
ప్రముఖ నిర్మాత మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం
Updated : Dec 4, 2023
తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చంద్ర మోహన్ గారి మరణం నుంచి చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే ఎన్నో వైవిధ్యమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించిన నిర్మాత మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది.
ప్రముఖ నిర్మాత మన్నం సుధాకర్ నిన్న చెన్నై లో మరణించారు. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని తన ఇంటి మెట్ల మీద నుంచి జారిపడ్డ సుధాకర్ గారు తీవ్ర అస్వస్ధతకి లోనవ్వడంతో కొన్ని రోజుల నుంచి ప్రముఖ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటు ఉన్నారు. చివరకి పరిస్థితి విషమించడంతో నిన్న పరమపదించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకి చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు తమ సానుభూతిని తెలియచేసారు.
శ్రీకాంత్ సౌందర్య లు హీరో హీరోయిన్లు గా వచ్చిన తారకరాముడు, నా మనసిస్తారా, అలాగే శ్రీకాంత్ ఛార్మి లు హీరోయిన్లుగా వచ్చిన సేవకుడు లాంటి సినిమాలతో పాటు తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా వచ్చిన వాలి తెలుగు డబ్బింగ్ చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు. ఇలా పలు విభిన్నమైన చిత్రాలని నిర్మించి టాలీవుడ్ లో మంచి అభిరుచి గల నిర్మాతగా సుధాకర్ గారు పేరుతెచ్చుకున్నారు. అలాగే ఆయన ఎన్నో సినిమాలకి కెమరామెన్ గా కూడా పని చేసారు. ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గర ఉన్న కారుమంచి ఆయన స్వగ్రామం..ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు.