English | Telugu
సునీల్, నాగచైతన్య హీరోలుగా చిత్రం
Updated : May 27, 2012
సునీల్, నాగచైతన్య హీరోలుగా చిత్రం ఒకటి రానుంది. వివరాల్లోకి వెళితే తమిళంలో ఆర్య, మాధవన్ హీరోలుగా నటించగా వచ్చిన సూపర్ హిట్ "వేట్టై" చిత్రం ఆధారంగా, తెలుగులో సునీల్, నాగచైతన్య హీరోలుగా ఒక చిత్రాన్ని పునర్నిర్మించబోతున్నారు. తమిళంలో "వేట్టై" చిత్రంలోని మాధవన్ పాత్రలో సునీల్, ఆర్య పాత్రలో నాగచైతన్య నటిస్తారని సమాచారం.
ఈ "వేట్టై" చిత్రం తెలుగు రీమేక్ కి "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" ఫేం డాలీ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని సమాచారం. ఇ చిత్రంలో సునీల్ అన్నగా, నాగచైతన్య తమ్ముడిగా నటిస్తున్నారు.