English | Telugu
ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్...?
Updated : May 27, 2012
ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్... అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతూంది. ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వినికిడి.
గతంలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించిన ఒక చిత్రం స్టైల్లో ఈ చిత్రంలో కూడా రామ్ చరణ్ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. పూర్తి వినోదాత్మకంగా ఉంటూనే రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా యాక్షన్ సీన్లూ, డ్యాన్సులూ ఉంటాయని అంటున్నారు. ఈ చిత్రానికి ఆకుల శివ మాటలు వ్రాశారు.