English | Telugu
నిరాహార దీక్షకు దిగనున్న స్టార్ దర్శకుడి భార్య?
Updated : Jun 8, 2015
సినిమా వాళ్ల జీవితాలన్నీ పైపైన మెరుగులే. లోపలకు చూస్తే.. డొల్లతనం తెలుస్తుంది. ఓ స్టార్ దర్శకుడు, వెండి తెరపై నీతి సూత్రాలు వల్లించే ఓ మేధావి.. తన కుటుంబ జీవితాన్ని మాత్రం అతలాకుతలం చేసుకొన్నట్టు టాలీవుడ్ టాక్. రెండేళ్ల నుంచీ ఇంటికి వెళ్లకుండా ఓస్టార్ హోటల్‌లోనే మకాం పెట్టేశాడట. దాంతో సరదు దర్శకుడి భార్యకు చిర్రెత్తుకొచ్చింది. ఇటీవల తన భర్త నివాసం ఉంటున్న స్టార్ హోటల్‌కి వెళ్లింది. ఆ లాబీలో గొడవకు దిగింది. తన భర్త ఇంటికి వచ్చి తనతో కాపురం చేస్తానని మాటిస్తే తప్ప అక్కడి నుంచి కదలనని భీష్మించుకొని కూర్చొందట. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని బెదిరించిందట. దాంతో సదరు దర్శకుడు బెదిరిపోయినట్టు టాక్. దర్శకుడి సన్నిహితులు ఆమెకు నచ్చజెప్పి పంపడంతో పెద్ద రాద్దాంతం నుంచి ఆ దర్శకుడు తృటిలో తప్పించుకొన్నాడని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరనేదానిపై పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.