English | Telugu
సింగిల్ టేక్‌లో మెప్పించిన హన్సిక
Updated : Jun 8, 2015
మన భాష కాని భాషలో ఓ లెంగ్తీ డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పడమంటేనే గొప్ప విషయం. అలాంటిది పొయెటిక్‌గా సాగే లెంగ్తీ డైలాగ్‌ను అలా ఒకే ఒక్క షాట్‌లో చెప్పడమంటే.. నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. అందుకే అందాల తార హన్సిక ఇప్పుడు ప్రశంసల వర్షంలో తడిసిముద్దవుతోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా పులి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందట. శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన షెడ్యూల్‌లో హన్సిక ఓ లెంగ్తీ పొయెటిక్ డైలాగ్‌ని చెప్పాల్సి వచ్చిందట. అయితే హన్సిక మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒకే ఒక్క టేక్‌లో ఆ డైలాగ్‌ని చెప్పి విజయ్ చేత శభాష్ అనిపించుకుందట. పులి చిత్రంలో శ్రుతి హాసన్ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా హన్సిక తల్లి పాత్రలో శ్రీదేవి దర్శనమివ్వనుంది.