English | Telugu

5వేల మినీ థియేట‌ర్లు.. సూత్ర‌ధారి ఎవ‌రు?


థియేట‌ర్ల విష‌యంలో చిత్ర‌సీమ‌లో గుత్తాధిప‌త్యం నెల‌కొంది. నలుగురి చేతిల్లోనే థియేట‌ర్ల‌కు కబ్జా అయిపోయాయి. చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌డం లేదు. దొరికినా... వ‌చ్చిన డ‌బ్బులు అద్దె డ‌బ్బులకే స‌రిపోవ‌డం లేదు. అందుకే ఇప్పుడు మినీ థియేట‌ర్లు అనే ఆలోచ‌న తెర‌పైకి వ‌చ్చింది. చిత్ర‌సీమ‌లో కొన్ని పెద్ద త‌ల‌కాయ‌లు.. చేస్తున్న ప్ర‌య‌త్న‌మిది. రూ.20లక్ష‌ల‌కే థియేట‌ర్లు నిర్మించాల‌న్న‌ది వీరి ల‌క్ష్యం. చోటు చూపించి, రూ.20 ల‌క్ష‌లు ఇస్తే చాలు, థియేట‌ర్లు క‌ట్టివెళ్లిపోతారు. ప్ర‌ధాన కూడ‌ళ్లోనే థియేట‌ర్ ఉండాల‌ని రూలేం లేదు. నాలుగు అపార్ట్‌మెంట్ల మ‌ధ్య‌లో ఖాళీ స్థ‌లం ఉన్నా స‌రిపోతుంది. 100 నుంచి 150 సీట్ల కెపాసిటీతో థియేట‌ర్లు క‌డితే చిన్న సినిమాల‌కు అనువుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దాదాపు 5 వేల థియేట‌ర్ల స్థాప‌న వీరి ల‌క్ష్యం. చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి స‌హ‌కారంతో ఈ థియేట‌ర్లు నిర్మిస్తార‌ట‌. టికెట్టు రేట్లు కూడా బాగా త‌గ్గే అవ‌కాశం ఉంది. ఈ మొత్తం కార్య‌క్ర‌మం వెనుక రామోజీరావు హ‌స్తం, అండ‌దండ‌లు ఉన్న‌టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యి, నిజంగానే 5 వేల థియేట‌ర్లు నెల‌కొల్పితే.. థియేట‌ర్ల గుత్తాధిప‌త్యం అనే మాటే వినిపించ‌దు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.