English | Telugu

ఎమోషనల్ గా నయనతార

ఎమోషనల్ గా నయనతార ఒక్కసారిగా కన్నీళ్ళ పర్యంతం అయ్యింది. వివరాల్లోకి వెళితే చిన్నప్పుడు మనం టెంత్ క్లాస్ లాస్ట్ వర్కింగ్ డే రోజున ఫ్రెండ్స్ అందర్నీ వదిలి వెళ్ళాల్సి వస్తుందని చాలా బాధపడే ఉంటాం. అలాంటి ఫీలింగే పాపం ప్రముఖ హీరోయిన్ నయనతారకు కూడా కలిగింది. బాపు గారి దర్శకత్వంలో, యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్రమూర్తిగా నటిస్తూండగా, సీతాదేవిగా నయనతార నటిస్తుండగా, యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న పౌరాణిక కళాఖండం "శ్రీరామరాజ్యం".

ఈ చిత్రంలో నయనతార పాత్ర పూర్తయిన చివరి రోజున నయనతార చాలా ఎమోషనల్ అయ్యింది. ఆ చిత్రమ యూనిట్ సభ్యులందరికీ నమస్కారం చేస్తూ కన్నీళ్ళ పర్యంతం అయ్యింది. ఏదో కొత్త పెళ్ళి కూతురు పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళినప్పుడు ఎలా బాధపడుతుందో అంతలా నయనతార బాధపడింది. దర్శకులు బాపుగారికి పాదనమస్కారం చేసింది. అది నేను చెపితే అంత బాగోదు కానీ మీరే చూడండి.