English | Telugu
ప్రభుదేవాతో దళపతి నయా ఫ్రెండ్ షిప్... వైరల్ అవుతున్న న్యూస్
Updated : Oct 11, 2023
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు దళపతి 68 అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓ పాటను తెరకెక్కించారు. ఈ పాట ఫ్రెండ్‌షిప్ ప్రధానంగా సాగుతుంది. ఈ పాటలో దళపతి విజయ్‌తో పాటు ప్రభుదేవా, ప్రశాంత్‌కూడా స్టెప్పులేశారు. నియర్ ఫ్యూచర్‌లో ఈ పాట ఫ్రెండ్‌షిప్ యాంథమ్‌గా మెప్పిస్తుందని అంటున్నారు డైరక్టర్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోంది దళపతి 68.
దళపతి 68లో ఓపెనింగ్‌లోనే ఈ ఫ్రెండ్‌షిప్ సాంగ్ వచ్చేలా స్క్రీన్‌ప్లేని సెట్ చేశారట వెంకట్ ప్రభు. రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. విజయ్ వారిసులోనూ ఫస్ట్ సాంగ్‌కి రీసెంట్ టైమ్స్ లో కొరియోగ్రఫీ చేశారు రాజు సుందరం. దళపతి 68 సాంగ్‌కి ఆయన చెన్నైలో కొరియోగ్రఫీ చేశారు. విజయ్, ప్రభుదేవా ఇద్దరూ డ్యాన్స్ ఇరగదీస్తారు కాబట్టి, ఈ డ్యాన్స్ నెంబర్‌ని చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారట రాజు సుందరం.
ఈ పాటలోనే కాదు, సినిమాలోనూ విజయ్ కేరక్టర్ వేరే లెవల్లో ఉంటుందని టాక్. విజయ్ కేరక్టర్ కోసం స్పెషల్ హోమ్‌వర్క్ చేశారట వెంకట్ ప్రభు. ఆ మధ్య యుఎస్‌లోని ఓ వీఎఫ్ ఎక్స్ స్కాన్ ముందు విజయ్ కనిపించిన తీరుతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఓ వైపు ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, మరోవైపు లియో అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట విజయ్.
విజయ్ హీరోగా నటించిన లియో మూవీ అక్టోబర్ 19న విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం కాశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది. త్రిష ఈ సినిమాలో విజయ్ లేడీ లవ్‌గా కనిపిస్తారు. సంజయ్ దత్ కీ రోల్ చేశారు. లోకేష్ యూనివర్శ్‌లో సాగే ఈ సినిమాలోనూ కమల్ పార్టిసిపేషన్ ఉంటుందన్నది టాక్. అయితే, అది ఎలా ఉంటుందనేది స్క్రీన్ మీద తెలుసుకోవాలని అంటున్నారు లోకేష్.