English | Telugu
స్కంద 2: బోయపాటి నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
Updated : Sep 28, 2023
నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులకి ఒక విషయం అర్ధమైంది. బోయపాటి బాలకృష్ణ ల కాంబినషనే కాదు బోయపాటి,రామ్ పోతినేని ల కాంబినేషన్ కూడా ఇంక రిపీట్ గా ఉండబోతుందని ఆ ఇద్దరి కాంబో లో అద్భుతమైన సినిమాలు రాబోతున్నాయని చాలా క్లియర్ కట్ గా అర్ధమైంది. ఈ ఇద్దరి కలయికలో ఈ రోజు వచ్చిన స్కంద మూవీ వరల్డ్ వైడ్ గా సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని రికార్డు కలెక్షన్ ల దిశగా దూసుకెళ్లిపోతుంది.అలాగేస్కంద సినిమా చివరలో బోయపాటి చెప్పిన ఒక విషయం ఇప్పుడు రామ్ అండ్ బోయపాటి అభిమానులతో పాటు సినీ అభిమానులని కూడా ఆనందం లో ముంచెత్తుతుంది.
అందరూ ఉహించినట్టుగానే ఈ రోజు విడుదల అయిన స్కంద మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది .రామ్ పోతినేని అభిమానులు స్కంద సినిమా ఘన విజయాన్ని పురస్కరించుకొని చాలా ఏరియాల్లో బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు .అలాగే ఈ సినిమా తో మా హీరో సూపర్ స్టార్ రేంజ్ హీరో స్థాయికి ఎదిగినట్టే అని చెప్తున్నారు .వాళ్ళు చెప్తున్నట్టుగానే స్కంద మూవీలో రామ్ నటన ,డైలాగ్ డెలివరీ ఒక రేంజ్ లో ఉంది. డాన్స్ లు కూడా కొత్త స్టైల్ తో ప్రదర్శించాడు. ఇంక ఊర మాస్ సినిమాలని తీసే బోయపాటి స్కంద మూవీ ని కూడా ఊర మాస్ లెవెల్లో తీసాడు.కొన్ని సీన్స్ కి అయితే థియేటర్స్ లో గూస్ బంప్స్ రావటం గ్యారంటీ
ఇంక అసలు విషయానికి వస్తే ..స్కంద సినిమా చివరలో బోయపాటి స్కంద పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పాడు.బోయపాటి అలా చెప్పడం తో రామ్ అండ్ బోయపాటి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు .స్కంద ఫస్ట్ పార్ట్ లోనే పొలిటికల్ టచ్ ఇచ్చిన బోయపాటి సెకండ్ పార్ట్ లో ఇంకేం చెప్పబోతాడో అని అందరు ఇప్పటినుంచే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే స్కంద మొదటి పార్ట్ తో హిట్ కొట్టిన బోయపాటి ,రామ్ లు సెకండ్ పార్ట్ తో కూడా హిట్ కొట్టడం గ్యారంటీ అని కూడా అంటున్నారు.