English | Telugu
నేను ఎవరికీ భయపడను... నా స్టేట్ మెంట్ కు కట్టుబడే ఉన్నా..!
Updated : Dec 24, 2025
దండోరా మూవీ ఈవెంట్ లో హీరోయిన్ల దుస్తుల గురించి ప్రముఖ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. శివాజీ కామెంట్స్ ని పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. కొందరు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి కూడా ఫిర్యాదు చేశారు. వివాదం ముదురుతున్న నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ నిన్న శివాజీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక తాజాగా దండోరా ప్రెస్ మీట్ లో మరోసారి ఈ విషయంపై స్పందించారు. "నా స్టేట్ మెంట్ కు కట్టుబడి ఉన్నాను.. నేను ఎవరికీ భయపడను" అని శివాజీ కామెంట్స్ చేయడం విశేషం. (Sivaji Controversy)
ఇటీవల దండోరా ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు నిండుగా బట్టలు వేసుకోవాలని, శరీరం కనిపించేలా బట్టలు వేసుకోకూడదని అన్నారు. ఈ క్రమంలో రెండు అభ్యంతరకర పదాలను ఉపయోగించారు. ఇదే విషయాన్ని తాజా ప్రెస్ మీట్ లో శివాజీ ప్రస్తావించారు.
"ఆడ బిడ్డలకు క్షమాపణలు. ఆ రెండు పదాలు ఉపయోగించడం తప్పు. నా ఇన్నేళ్ల సినీ జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ.. ఎప్పుడూ అలాంటి పదాలు వాడలేదు. మొదటిసారి అలా మాట్లాడినందుకు బాధపడ్డాను. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ పదాలు ఉపయోగించడం తప్పు అయినప్పటికీ.. ఆ స్టేట్ మెంట్ కి మాత్రం నేను కట్టుబడి ఉన్నాను. ఎవరికీ భయపడే పనే లేదు. నా ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డల మీద ఉన్న ప్రేమతోనే, వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే.. ఆ స్టేట్ మెంట్ ఇచ్చాను." అని శివాజీ చెప్పుకొచ్చారు.
Also Read: ఎన్టీఆర్ వర్సెస్ అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న త్రివిక్రమ్?