English | Telugu
బాలీవుడ్ ని భయపెడుతున్న పుష్పరాజ్!
Updated : Sep 13, 2023
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ హైప్డ్ సినిమాలలో 'పుష్ప: ది రూల్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప: ది రైజ్' 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రెండో భాగంగా 'పుష్ప: ది రూల్' రూపుదిద్దుకుంటోంది. 'పుష్ప-2'పై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రూ.1000 నుంచి1500 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందనే అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఆ తేదీకి రావాలని చూసిన పలు భాషల సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయి.
బాలీవుడ్ లో రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా రూపొందే 'సింగం' సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ సిరీస్ నుంచి 'సింగం', 'సింగం రిటర్న్స్' రాగా.. రెండు ఘన విజయం సాధించాయి. హీరోగా అజయ్ దేవ్‌గణ్ కి మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించాయి. ఇప్పుడు వీరి కలయికలో 'సింగం ఎగైన్' రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఆగస్టు 15న విడుదల చేయాలని మొదట భావించారు. కానీ ఇప్పుడు 'పుష్ప-2' దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకోవాలని చూస్తున్నారట. అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి ల సినిమా. పైగా సింగం సిరీస్. కరీనా కపూర్, దీపికా పదుకొణె ముఖ్యపాత్రలు పోషించడంతో పాటు, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్ చేస్తున్నారట. దానికితోడు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, కరణ్ జోహార్ నిర్మాతలు. ఇన్ని పాజిటివ్ లు, ఇంత బలం ఉన్నప్పటికీ.. పుష్పరాజ్ పోటీలో ఉంటే తమ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన సింగం టీమ్.. కొత్త విడుదల తేదీ చూసుకునే పనిలో ఉందట. ఇదే బాటలో ఇతర భాషలకు చెందిన మరికొన్ని సినిమాలు పయనించే అవకాశముంది అంటున్నారు.