English | Telugu
మంగళవారం.. శెట్టి ద్వయం కలెక్షన్స్ పై కారం
Updated : Sep 13, 2023
అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి టైటిల్ రోల్స్ లో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి బ్రేక్ ఈవెన్ దశకు చేరుకుంది. సోమవారం నుంచి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసి.. హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది కూడా. అయితే, తొలి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటికి తగ్గకుండా షేర్ రాబట్టిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఆరో రోజైన మంగళవారం అంతగా ప్రభావం చూపలేకపోయింది. నిన్న (మంగళవారం) ఈ సినిమా కేవలం రూ. 74 లక్షల షేర్ మాత్రమే ఆర్జించింది. వరల్డ్ వైడ్ గా మాత్రం ఆరో రోజు రూ. 1.21 కోట్ల షేర్ చూసింది. ఇక లాభాల విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 2. 39 కోట్ల వరకు ప్రాఫిట్స్ చూసింది. మరి.. ఫుల్ రన్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఏ స్థాయి వసూళ్ళు ఆర్జిస్తుందో చూడాలి.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 6 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 4.95 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 80 లక్షల షేర్
ఆంధ్రా: రూ. 3.15 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.8.90 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.24 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.5.75 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్స్ : రూ.15.89 కోట్ల షేర్