English | Telugu

శంకర్ 'ఐ' సెన్సార్ రిపోర్ట్

శంకర్, విక్రమ్ ల భారీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున దీనిని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడని దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి కూడా అలాగే పనిచేశాడు. చిత్రాన్ని లేట్ చేసేస్తున్నాడంటూ ఎన్ని విమర్శలు వచ్చినా, సంతృప్తికరంగా వచ్చేవరకు సైలెంటుగా తన పని తాను చేసుకున్నాడు. ఇప్పుడు చిత్రం ఒక 'ఐ' ఫీస్ట్ గా వుందని కోలీవుడ్ టాక్. ఆస్కార్ బ్యానర్స్ పై 180 కోట్ల రూపాయలతో రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు దేశీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.