English | Telugu
'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్స్.. చిరంజీవి సంచలన రికార్డు!
Updated : Jan 17, 2026
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. చిరంజీవి కెరీర్ లో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమా ఇది కావడం విశేషం.
చిరంజీవి కెరీర్ లో రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన సినిమాలు గతంలో రెండు ఉన్నాయి. 2019లో విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' రూ.240 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా, 2023లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' విషయానికొస్తే.. నిర్మాతలు ప్రకటించిన దాని ప్రకారం.. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.226 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే మొదటి వారంలోనే ఈ మూవీ రూ.250 కోట్ల క్లబ్ లో చేరి, చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుంది.
ఇదిలా ఉంటే, టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో మూడు రూ.200 కోట్ల గ్రాస్ సినిమాలున్న ఏకైక హీరో చిరంజీవి కావడం విశేషం.
Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ