English | Telugu

త‌మ్మూని టెంప్ట్ చేయ‌డం సాధ్య‌మా??

ఈమ‌ధ్య బ‌డా దర్శ‌కులూ చిన్న సినిమాల‌పై దృష్టి పెట్టారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో, చిన్న స్టార్ కాస్టింగ్‌తో ఓ సినిమా తీసి, త‌మ క‌థ‌ల‌కు ప్రాణం పోస్తున్నారు. కృష్ణ‌వంశీది ముందు నుంచీ ఇదే దారి. అటు స్టార్స్‌తోనూ, ఇటు కొత్త‌వాళ్ల‌తోనూ సినిమాలు తీస్తారాయ‌న‌. ప్ర‌స్తుతం ఓ చిన్న సినిమా తీయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకొంటున్నారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడు. దిల్‌రాజు మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తారు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఓ క‌థానాయిక చుట్టూ తిరిగే క‌థ‌. ఆ పాత్ర కోసం ఓ ప్ర‌ముఖ క‌థానాయిక‌ని సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారమ్‌. ఆమె ఎవ‌రో కాదు.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఇప్ప‌టి వ‌ర‌కూ లేడీ ఓరియెంటెడ్ పాత్ర చేయ‌ని త‌మ‌న్నా.. కృష్ణ‌వంశీ ప్రపోజ‌ల్ అంగీక‌రిస్తుందా? లేదా అనేది ఆస‌క్తిగా మారింది. కృష్ణ‌వంశీ సినిమా కాబ‌ట్టి టెమ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. త‌మ‌న్నా కాదంటే మ‌రొక‌రితో చే్దామ‌ని వంశీ కూడా ఫిక్స‌యిపోయాడ‌ట‌. బంతి ఇప్పుడు మిల్కీ బ్యూటీ కోర్టులో ఉంది.