English | Telugu
ముకుంద సెన్సార్ రిపోర్ట్
Updated : Dec 19, 2014
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వరుణ్ తేజ తొలి సినిమా ముకుంద. ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈనెల 24న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ముకుంద’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతోన్న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌పై మెగా ఫాన్స్‌కి భారీ అంచనాలే ఉన్నాయి. కొత్త హీరో అయినా కానీ వరుణ్ తేజ్‌పై కాన్ఫిడెన్స్‌తో బయ్యర్స్ కూడా భారీగానే ఇన్వెస్ట్ చేసారు. ఈ చిత్రానికి దగ్గర దగ్గర ఇరవై కోట్ల వరకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ టాక్. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది.