English | Telugu

కృతిశెట్టి వర్సెస్‌ కీర్తి సురేష్‌.. ఎవరు ఎవరికి షాక్‌ ఇచ్చారు?

మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కృతిశెట్టికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ‘ఉప్పెన’ చిత్రంలో తన అందాలతో కుర్రకారుకు ఆరాధ్యదేవతగా మారి ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. తమిళ్‌లో కూడా గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేసింది. కానీ, ఆమెను దురదృష్టం వెంటాడుతోంది.

కార్తీతో చేసిన ‘వా వతియార్‌’ చిత్రం రిలీజ్‌ వాయిదా పడుతూ వస్తోంది. అలాగే ప్రదీప్‌ రంగనాథన్‌తో చేస్తున్న ‘లిక్‌’ చిత్రం కూడా పోస్ట్‌ పోన్‌ అవ్వడంతో కృతి ఎంతో డిజప్పాయింట్‌ అయింది. పనిలో పనిగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇద్దామని ట్రై చేసింది. వాస్తవానికి సూపర్‌ 30 అనే హిందీ సినిమాతో తన కెరీర్‌ స్టార్ట్‌ చేసింది కృతి. ఆ సినిమాలో స్టూడెంట్‌గా చిన్న పాత్రలో కనిపిస్తుంది.

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత హిందీ ఆఫర్స్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒక సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. దాదాపు ఆ సినిమా కన్‌ఫర్మ్‌ అయిపోయింది. కానీ, చివరి క్షణంలో ఆ సినిమా కీర్తి సురేష్‌ తన్నుకుపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో వీరిద్దరి గురించి టాపిక్‌ నడుస్తోంది.

కీర్తి సురేష్‌ చేసిన బేబీ జాన్‌ సినిమా సక్సెస్‌ అవ్వకపోయినా ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఓ పక్క తెలుగు, తమిళ్‌ సినిమాలు చేస్తూనే హిందీలో కూడా మంచి ఆఫర్స్‌ రాబట్టుకుంటోంది.కృతి శెట్టి మాత్రం తెలుగు సినిమాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళ్‌లో మూడు సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఇప్పట్లో రిలీజ్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈ విషయంలో కృతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.