English | Telugu
సెప్టెంబర్ లో స్టార్ బ్యూటీస్ సందడి.. ఎవరి డామినేషన్ ఉండబోతోంది
Updated : Aug 29, 2023
ఈ ఏడాది సెప్టెంబర్ నెల.. క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 28 వరకు పలు ఆసక్తికరమైన చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. వీటిలో కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ చిత్రాలన్నింటిలోనూ స్టార్ హీరోయిన్స్ కనువిందు చేయనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 1న రానున్న ఖుషిలో సమంత నాయికగా నటించగా.. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో అనుష్క హీరోయిన్. ఇక అదే రోజు రాబోతున్న షారుక్ ఖాన్ జవాన్ లో నయనతార కథానాయిక. అలాగే సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న స్కందలో శ్రీలీల హీరోయిన్ కాగా.. అదే రోజు రాబోతున్న చంద్రముఖి 2లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నాయిక. అలాగే సెప్టెంబర్ 28న తెరపైకి వస్తున్న సలార్ లో శ్రుతి హాసన్ హీరోయిన్. మరి.. వీరిలో ఎవరి డామినేషన్ ఉండబోతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.