English | Telugu

రామ్, నాగ్ పైనే ఆశలు.. ఫెస్టివల్స్ ప్లస్ అయ్యేనా?

కొందరి ప్రయత్నాలు ఎంతో ప్రామిసింగ్ గా అనిపిస్తాయి. కాకపోతే, రిజల్ట్స్ మాత్రం తేడా కొట్టేస్తుంటాయి. సరిగ్గా.. ఇలాంటి పరిస్థితే ఓ నిర్మాతది కూడా. ఇప్పటివరకు అతను నిర్మించిన సినిమాలన్నీ క్రేజీగా ఉన్నవే. ఎటొచ్చిసాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరంటే.. శ్రీనివాస చిట్టూరి.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఆయన ఇప్పటివరకు యుటర్న్ (2018), సీటీమార్ (2021), ది వారియర్ (2022), కస్టడీ (2023) వంటి సినిమాలు నిర్మించారు. వీటిలో సమంత నటించిన యుటర్న్, గోపీచంద్ స్టారర్ సీటీమార్ యావరేజ్ గా నిలవగా.. ది వారియర్, కస్టడీ మాత్రం డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో.. రానున్న స్కంద, నా సామి రంగపైనే ఆశలు పెట్టుకున్నారాయన.

ది వారియర్ తరువాత రామ్ పోతినేని కాంబినేషన్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన స్కంద వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక నాగార్జునతో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న నా సామి రంగ 2024 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి.. ఫెస్టివల్ స్సెషల్స్ గా రాబోతున్న స్కంద, నా సామి రంగ.. శ్రీనివాస చిట్టూరి ప్రయత్నానికి, పట్టుదలకి తగ్గ ఘన విజయాలను అందిస్తాయో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.