English | Telugu
సమంతను ఏడిపించిన ‘ఖుషి’ టీమ్.. అసలు ఏం జరిగింది?
Updated : Aug 29, 2023
ఖుషి’ యూనిట్ చేసిన పని వల్ల హీరోయిన్ సమంత కన్నీరు పెట్టుంది. ఆమెను అంతగా బాధించిన విషయం ఏమిటి? వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరం కాశ్మీర్‌లో జరిగింది. అప్పుడే సమంత బర్త్‌డే కూడా వచ్చింది. ఏదైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చెయ్యాలని విజయ్ దేవరకొండ అనుకున్నాడు. డైరెక్టర్ శివ నిర్వాణతో డిస్కస్ చేసి పక్కాగా ప్లాన్ చేశారు. ఓ రోజు రాత్రి ఒక ఇంపార్టెంట్ సీన్ చెయ్యాలంటూ డైరెక్టర్ శివ.. సమంతకు డైలాగ్ పేపర్ ఇచ్చాడు. దాన్ని తెగ ప్రాక్టీస్ చేసేసి, రిహార్సల్స్ కూడా చేసింది. అప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఆ సీన్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయిపోయి నటించింది. యూనిట్‌లోని అందరికీ అది నిజంగా సినిమా కోసం తీసే సీన్ కాదని తెలుసు. అందుకే అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కెమెరామెన్ మురళి కూడా రకరకాల యాంగిల్స్ మారుస్తూ సీన్‌ని షూట్ చేస్తున్నాడు. సీన్‌లో ఉన్న డెప్త్ వల్ల సమంతకు కన్నీళ్ళు ఆగలేదు. బోరున ఏడ్చేసింది. తర్వాత అది నిజంగా సినిమా కోసం చేసింది కాదని తెలిసి హ్యాపీగా ఫీల్ అయిందట. ఇలాంటి సర్‌ప్రైజ్ జీవితంలో తనెప్పుడూ చూడలేదని చెప్పింది సమంత. అలా సమంత బర్త్‌డేకి ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసి యూనిట్‌లోని అందరూ ఎంజాయ్ చేశారట.