English | Telugu
రామ్‌తో సంజయ్ దత్ ఢీ!
Updated : Jul 29, 2023
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు స్కంధ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే ఈ హీరో పూరి జగన్నాథ్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దీనికి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ సినిమా ఉంటుందని అప్పట్లోనే వీరు ప్రకటించారు. ఈ సీక్వెల్ షూటింగ్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. అది కూడా ముంబైలో. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ అవుతుంది.
కాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇందులో విలన్‌గా నటించబోతున్నారని. ఇటీవల పూరి ఆయన్ని కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేశారు. ఆయనకు కూడా నచ్చటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్. డబుల్ ఇస్మార్ట్ మూవీ షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుంది. హీరో రామ్‌పై కేచ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు పూరి. ప్రభాస్, మారుతి మూవీలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తోన్న మరో టాలీవుడ్ మూవీ ఇది. ఇప్పుడు సంజయ్ దత్ ఎక్కువగా సౌత్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. కె.జి.యఫ్ తర్వాత లియో సినిమాలో నటించారు. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు రానున్నాయి.
డబుల్ ఇస్మార్ట్‌లో హీరోయిన్స్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఇంకా పూరి అండ్ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. ఇస్మార్ట్ శంకర్‌లో నటించిన నిధి అగర్వాల్ ఇందులో కనిపించనుందా? లేదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.