English | Telugu
విజయ్‌తో మళ్లీ సమంత జోడీకడుతున్నారా?
Updated : Apr 5, 2023
కొన్ని జోడీలకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి జంటల్లో విజయ్ - సమంత జంట ఒకటి. సామ్‌తో విజయ్ జోడీ కడితే చూడ్డానికి మేం రెడీ అంటూ హింట్స్ ఇస్తున్నారు దళపతి ఫ్యాన్స్. ఇటీవల ఈ తరహా విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చారు దళపతి విజయ్. ఆయనికి వెల్కమ్ చెబుతూ అల్ఫోన్స్ పుత్రేన్ పోస్టు పెట్టారు. అల్ఫోన్స్ పేరు చెప్పగానే అందరికీ ప్రేమమ్ సినిమా గుర్తుకొస్తుంది.
సక్సెస్‌ఫుల్ డైరక్టర్‌గా పేరున్న ఆయనకు లాస్ట్ ఇయర్ మాత్రం చేదుఫలితాన్నే అందించింది. పృథ్విరాజ్ సుకుమారన్, నయనతార కలిసి నటించిన సినిమా గోల్డ్. ఈ మూవీని డైరక్ట్ చేశారు అల్ఫోన్స్. ప్రేక్షకులు, విమర్శకులు ఒకే మాట మీద నిలబడినట్టు ఈ సినిమాను ఫ్లాప్ చేశారు. దీని తర్వాత మలయాళంలో సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు అల్ఫోన్స్. త్వరలోనే తమిళ్‌లో ఓ సినిమా చేస్తానంటూ ఆ మధ్య హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విజయ్, సమంత జంటగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించమని విజయ్ ఫ్యాన్స్ తరఫున రిక్వస్టులు అందాయి అల్ఫోన్స్ కి. మంచి ప్రేమ, యాక్షన్ ఉన్న సబ్జెక్టుని ఈ ఇద్దరితో తెరకెక్కించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు అల్ఫోన్స్. ``నాకు వ్యక్తిగతంగా విజయ్ అంటే చాలా ఇష్టం. అలాగే సమంతలో ఉన్న పొటెన్షియల్ చాలా ఇష్టం.
వారిద్దరి మీద లవ్ ఎంతగా వర్కవుట్ అవుతుందో, కమర్షియల్ యాక్షన్ సబ్జెక్ట్ కూడా అంతే ఎఫెక్టివ్‌గా వర్కవుట్ అవుతుంది. అందుకే నేను చేయడానికి రెడీగా ఉన్నాను`` అని అన్నారు. రోమియో పిక్చర్స్ లో ఓ తమిళ సినిమా చేయడానికి ఆల్రెడీ అసోసియేట్ అయనట్టు తెలిపారు. అల్ఫోన్స్ తరహా సబ్జెక్టులకు ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉంది. నేచురాలిటీకి దగ్గరగా ఉంటే విషయాలతో సినిమాలు తీస్తారనే పేరుంది అల్ఫోన్స్ కి.