English | Telugu
బిగ్ సర్ ప్రైజ్.. 'వార్-2'లో జూనియర్ ఎన్టీఆర్!
Updated : Apr 5, 2023
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న 'వార్-2'లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే దానితో పాటే పారలల్ గా 'వార్-2'లో నటించాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు.
యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ యూనివర్స్ లో భాగంగా 'ఏ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' సినిమాలు రాగా అన్నీ ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా పఠాన్ చిత్రం వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దాంతో ఈ యూనివర్స్ సినిమాల పట్ల క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం 'టైగర్-3' షూటింగ్ దశలో ఉంది. 'వార్-2' ఈ ఏడాది పట్టాలెక్కనుంది. దీనికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్, హృతిక్ తలపెడితే అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు. సౌత్ బిగ్ స్టార్, నార్త్ బిగ్ స్టార్ కలిసి నటిస్తే ఇది అససిసలు పాన్ ఇండియా సినిమా అవుతుందని, దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.