English | Telugu
సమంత నటించిన వెబ్ సిరీస్ ని ఎందుకు పట్టించుకోవడం లేదు
Updated : Dec 6, 2023
హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ని తెచ్చుకునే హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. ఆలాంటి అరుదైన నటి సమంత. సమంత సినిమాలో ఉంటే చాలు ఆ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ గా మారిపోతుంది.అలాగే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేసి నేషనల్ వైడ్ గా పేరు సంపాదించింది. స్టిల్ ఇప్పటికి ఎంతో మంది నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం రెడీ గా ఉన్నారు. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న సమంత కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సంచలనం సృష్టిస్తుంది.
సమంత నుంచి వచ్చిన లాస్ట్ చిత్రం ఖుషి. విజయ్ దేవరకొండ సరసన సమంత ఆ సినిమా చేస్తున్నప్పుడే సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ ని కూడా చేసింది. అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకున్న ఈ సిరీస్ ని సమంత కంప్లీట్ కూడా చేసింది. కానీ ఇప్పుడు ఈ సిరీస్ విషయంలో ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. దీంతో ఈ సిరీస్ నిలిచిపోయిందా అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సిటాడెల్ ఒరిజినల్ వెర్షన్ అయిన ఇంగ్లీష్ సిటాడెల్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో తెలుగు వెర్షన్ ని ఆపేసారేమో అని అందరు అనుకుంటున్నారు.
ఇక సమంత అనారోగ్యం కారణంతో సినిమాల నుంచి ఒక ఏడాది గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె ట్రీట్మెంట్ దశలో ఉంది. ఆమె తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాక మరింత ఉత్సాహంగా నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.