English | Telugu
గుంటూరు కారం టార్గెట్ ఇదే.. కేరళలో క్లాస్, హైదరాబాద్ లో మాస్!
Updated : Dec 6, 2023
అతడు, ఖలేజా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మాస్ మసాలా ఫిల్మ్ సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గుంటూరు కారం విడుదలకు ఇంకా ఐదు వారాలే సమయం ఉండటంతో సినిమాని పూర్తి చేయడానికి మూవీ టీం జెట్ స్పీడ్ లో పని చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటల చిత్రీకరణ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. మొత్తం నాలుగు పాటలు ఉండగా ఇప్పటికే మాంటేజ్ సాంగ్, బిట్ సాంగ్ షూట్ కంప్లీట్ అయింది. కేరళలో డ్యూయట్, హైదరాబాద్ లో మాస్ సాంగ్ పిక్చరైజ్ చేయాల్సి ఉంది. డిసెంబర్ 25 నాటికి మొత్తం షూట్ పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ధమ్ మసాలా'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల కానుంది. వచ్చే వారం నుంచి మూవీ టీం ప్రమోషన్స్ లో జోరు పెంచే అవకాశముంది.