English | Telugu
విజయ్ సినిమాకి నో చెప్పిన ధోని హీరోయిన్..కారణం ఇదే!
Updated : Dec 6, 2023
2018 లో వెరైటీ చిత్రాల సృష్టికర్త బాల దర్శకత్వంలో వచ్చిన నాచ్చియార్ అనే చిత్రం ద్వారా తమిళ సినీరంగ ప్రవేశం చేసిన నటి ఇవానా. ఆ సినిమాలో హీరోగా చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సరసన హీరోయిన్ గా చేసి అధ్బుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత లవ్ టుడే అనే చిత్రంలో నటించి సౌత్ మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. తాజాగా ఇవానా ఇళయ దళపతి విజయ్ సినిమాకి నో చెప్పడం ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.
లేటెస్ట్ గా లియోతో భారీ హిట్ కొట్టిన విజయ్ తన తర్వాతి చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ మూవీలో విజయ్ చెల్లెలి క్యారక్టర్ కోసం చిత్ర యూనిట్ ఇవానా ని సంప్రదించింది. తొలుత ఇవానా ఈ సినిమాలో నటించటానికి ఒప్పుకుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ కూడా కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గాని ఇవానా ఆ సినిమాలో నటించడంలేదు. విజయ్ చెల్లెలిగా నటిస్తే ఇక అలాంటి పాత్రలే తన దగ్గరికి వస్తాయనే భయంతో ఇవానా విజయ్ సినిమా చెయ్యటంలేదని తమిళ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
కొంత మంది మాత్రం విజయ్ లాంటి హీరో సినిమాలో అవకాశం దొరకటమే కష్టం.అలాంటిది ఏకంగా విజయ్ చెల్లెలి క్యారెక్టర్ నే ఇవానా వదులుకోవడం ఆమె కెరీర్ కి మంచిది కాదేమో అని అంటున్నారు. మీనాక్షి చౌదరి విజయ్ సరసన నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి స్నేహ ,ప్రభుదేవా, యోగిబాబు, ప్రేమ్ జీ తదితరులు నటిస్తున్నారు. ఇవానా ప్రముఖ క్రికెటర్ ధోని నిర్మించిన ఎల్ జి ఎం సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది.