English | Telugu
నైజాం కింగ్ ప్రభాస్.. షేక్ చేసిన ‘సలార్’
Updated : Aug 31, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’. KGF 2 వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కావటంతో పాటు , ప్రభాస్ చాలా కాలం తర్వాత నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. దీంతో సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. సెప్టెంబర్ 28న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సలార్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ నైజాం ఏరియాలో ఈ సినిమా విషయంలో సెన్సేషన్‌ను క్రియేట్ చేసినట్లు టాక్.
వినిపిస్తోన్న వివరాల మేరకు నైజాం ఏరియాలో ‘సలార్’ థియేట్రికల్ హక్కులు రూ.80 కోట్లు పలుకుతున్నాయి. తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇందులో రూ.70లో నాన్ రిఫండబుల్.. రూ.10 కోట్లు రిఫండబుల్ అమౌంట్ గా మాటలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది. ఇక సీడెడ్ ఏరియా హక్కులు ఇంకా ఎవరూ తీసుకోలేదు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విక్రమ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రభాస్ సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటించింది. సలార్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 28న పార్ట్ వన్ గా సలార్ సీజ్ ఫైర్ రిలీజ్ కానుంది. పార్ట్ 2 మరెప్పుడూ రిలీజ్ అవుతుందో చూడాలి మరి. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ ఏకంగా 150 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ప్రతినాయకుడిగా మెప్పించనున్నారు.