English | Telugu

రష్మికకు బాలీవుడ్ షాక్... శ్రీలీలకు ఇక తిరుగులేదు!

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అమ్మడు రష్మిక మందన్న. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోందీ అమ్మడు. కేవలం స్టార్ హీరోలపైనే ఆమె ఫోకస్ పెట్టింది. అలాగే బాలీవుడ్ లోనూ పాగా వేయాలని తన వంతు ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవీ సక్సెస్ కాలేదు. కానీ రష్మిక మాత్రం తన నార్త్ ప్రయత్నాలను మాత్రం మానుకోలేదు. తాజాగా ఆమె షాహిద్ కపూర్ సినిమాలో నటించటానికి రెడీ అయ్యింది. షాహిద్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆమె నితిన్, వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ను కూడా పక్కకు పెట్టేసింది. షాహిద్ ప్రాజెక్ట్ కోసం డేట్స్ ను కేటాయించినట్లు సినీ సర్కిల్స్ సమాచారం.

మొన్నటి వరకు బాగానే ఉన్నప్పటికీ బడ్జెట్ అనుకున్న దాని కంటే మరీ ఎక్కువగా ఉండటంతో షాహిద్ కపూర్ సినిమాను మేకర్స్ పక్కకు పెట్టేశారట. దీంతో రష్మిక పరిస్థితి ఉన్నదీ పొయే, ఉంచుకున్నది పొయే అన్నట్లు తయారైంది. నితిన్ సినిమాను వదులుకుని వెళితే బాలీవుడ్ సినిమా ఏమో అటకెక్కింది. దీంతో అమ్మడుకి ఏం చేయాలో పాలుపోవటం లేదట. ఆమె ఇప్పుడు పుష్ప 2తో పాటు యానిమల్ సినిమాపైనే నమ్మకంగా ఉంది. మరి అమ్మడి నమ్మకాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో తెలియాంటే వెయిట్ చేయాల్సిందే మరి.

రష్మిక వదులుకున్న నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా మెప్పించనుంది.