English | Telugu
నన్ను చేసుకోబోయే అమ్మాయి ఎలా వుండాలంటే...!
Updated : Aug 31, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో తన పెళ్ళిపై, తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అనే విషయాలపై విజయ్ దేరకొండ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమైనప్పుడే పెళ్ళి చేసుకుంటానని, ఎవరో ఒత్తిడి చేస్తున్నారని మాత్రం చేసుకోను అన్నారు. తనతో అన్నీ షేర్ చేసుకునే అమ్మాయి, తన అభీష్టాలకు అనుగుణంగా ఉండే అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తను తినే విషయం దగ్గర నుంచి చాలా విషయాలు మరచిపోతుంటానని, అవన్నీ తనకు గుర్తు చేసే అమ్మాయి అయితే బాగుంటుందన్నారు. అమ్మాయి ఇంటెలిజెంట్ అయి ఉండాలని, తను చేసేవి ఆమె కూడా ఎంజాయ్ చేసేలా వుండే అమ్మాయి అయితే బాగుంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల తన చేతిలో ఓ అమ్మాయి చేయి వేసి వున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు విజయ్. అసలు విషయం త్వరలోనే ఎనౌన్స్ చేస్తానని కామెంట్ చేశాడు. అయితే అది తన పెళ్ళి కోసమని కొందరు, కాదు.. సినిమా ప్రమోషన్‌లో అదీ ఒక భాగమేనని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.