English | Telugu

‘సలార్’ కి రేవంత్ రెడ్డి సాయం చేస్తాడా?

ఇంక కేవలం తొమ్మిదంటే తొమ్మిది రోజుల్లో సలార్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ అభిమానులు అయితే సలార్ ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరగడం లేదనే డిసప్పాయింట్ తో ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే సలార్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో వేగం వచ్చింది. తాజాగా సలార్ సినిమా యూనిట్ తెలంగాణ ప్రభుత్వానికి ఒక వినతని ఇచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

భారీ బడ్జట్ తో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఎలా అయితే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చారో అలాగే సలార్ కి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని సలార్ టీం ప్రభుత్వాన్ని కోరుతుంది. వాళ్ళు అభ్యర్థిస్తున్న దాని ప్రకారం మల్టిప్లెక్స్ లకి జిఎస్ టి తో కలిపి టికెట్ రేటు 413 రూపాయిలు ఉండేలా అలాగే సింగల్ స్క్రీన్ కి 236 రూపాయిలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఆ రేటులన్ని ఒక వారం రోజుల పాటు ఉంటాయని ఆ తర్వాత మల్టి ప్లెక్స్ లకి 354 , సింగల్ స్క్రీన్ కి 230 రూపాయిలు గా నిర్ణయించుకునేలా కూడా అవకాశం ఇవ్వాలని సలార్ టీం కోరుతుంది

కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు తెలంగాణాలో మల్టి ప్లెక్స్ లకి 295 రూపాయిలు సింగిల్ స్క్రీన్ కి 175 గా ఉంది.మరి తెలంగాణ ప్రభుత్వం సలార్ టీం వినతిని ఒప్పుకుంటుందో లేదో చూడాలి. హోంబులే ఫిలిమ్స్ పతాకంపై అత్యంత భారీ వ్యయంతో రూపొందిన సలార్ లో ప్రభాస్ తో పాటు పృథ్వి రాజ్, శృతి హాసన్, శ్రేయ రెడ్డి, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు నటించారు. ఈ నెల 22 న సలార్ విడుదల కాబోతుంది.