English | Telugu
తెలుగు సినిమా గెలిచిందోచ్.. కానీ ఆ ఒక్కటి మాత్రం అడక్కు
Updated : Jan 15, 2026
-తెలుగు సినిమా అభిమానులు ఏమంటున్నారు
- సంక్రాంతి చిత్రాల రిపోర్ట్ ఏంటి!
-బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుందా
-ఇంతకీ ఆ ఒక్కటి ఏంటి
తెలుగు సినిమా అభిమానులు నిత్యం జపించే మంత్రం తెలుగు సినిమా గెలవాలని. ఈ సంక్రాంతి ఐదు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో వాళ్ళల్లో ఒకింత టెన్షన్ కూడా ఏర్పడింది. సంక్రాంతి పోటాపోటీలో ముందుగా హిట్ టాక్ వచ్చిన సినిమాకి, ఆ తర్వాత వచ్చిన సినిమాకి కంపేర్ చేస్తు నెగిటివ్ టాక్ తెస్తారేమో అనేదే వాళ్ళ ప్రధాన టెన్షన్. కానీ సంక్రాంతి సినిమాలపై ప్రేక్షకుల ఇచ్చిన తీర్పు తెలుగు సినిమా అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. వాటి వివరేలేంటో చూద్దాం.
ఈ సంక్రాంతికి రాజాసాబ్(The Rajasaab)తర్వాత వరుసగా మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku wignapthi)అనగనగ ఒక రాజు(Anaganaga Oka Raju), నారీనారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari)సంక్రాంతి వెలుగుల్ని మరింతగా పెంచుతూ సిల్వర్ స్క్రీన్ పై సినీ పరిమళాల్ని వెదజల్లడానికి వచ్చాయి. ఈ సినిమాలని వీక్షించిన ప్రేక్షకులు మాట్లాడుతు నాలుగు చిత్రాలు చాలా బాగున్నాయి. పైగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో తెరకెక్కి థియేటర్స్ లో నవ్వుల జడివాన కురిపిస్తున్నాయి. తెలుగు సినిమాకి మరింత మంచి రోజులు వచ్చాయనేలా ఈ సారి హీరో, హీరోయిన్స్ దగ్గరనుంచి అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపాక్ట్ చూపించాయి.
ఒక మూవీకి మరో మూవీ కి పోలిక కూడా లేకుండా సంక్రాంతి కి పర్ఫెక్ట్ విందు దొరికినట్లయింది. నాలుగు కూడా హిట్. కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్ళని రాబడతాయి. ప్రతి సంక్రాంతి ఇదే విధంగా వీనుల విందు లాంటి సినిమాలు మరిన్ని వచ్చి విజయాన్ని అందుకోవాలి. రాజా సాబ్ ఈ విషయంలో కొంచం వెనకపడిందని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో తెలుగు సినిమా అభిమానులు నూతనోత్సాహంతో సంబరాల్లో మునిగిపోయారు. పూర్తి రన్నింగ్ లో ఆయా చిత్రాలన్నీ సాధించే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు.