English | Telugu
సలార్ ఫ్యాన్స్ కి షాక్.. ఆలస్యంగా రానున్న ప్రభాస్!
Updated : Dec 13, 2023
ప్రస్తుతం సినీ ప్రియుల దృష్టి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న 'సలార్'పై ఉంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తోంది.
సలార్ మొదటి భాగం 2 గంటల 55 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో ఫస్టాఫ్ నిడివి 1 గంట 15 నిమిషాలు కాగా, సెకండాఫ్ 1 గంట 40 నిమిషాలు అని సమాచారం. అంటే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ నిడివి చాలా ఎక్కువ ఉండబోతుంది అన్నమాట. అంతేకాదు ఫస్టాఫ్ లో ప్రభాస్ చాలా తక్కువ సేపే కనిపిస్తాడట. సినిమా ప్రారంభమైన దాదాపు 25-30 నిమిషాలకు ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట. అందుకు తగ్గట్టుగా ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం కోసమే ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ను అలా రూపొందించారని అంటున్నారు. టీజర్ లో ప్రభాస్ పెద్దగా కనిపించలేదు. ట్రైలర్ లో కూడా లేట్ గా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో సైతం ప్రభాస్ ఎంట్రీ ఆలస్యంగానే ఉంటుందని న్యూస్ వినిపిస్తోంది.
ప్రభాస్ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుందని టాక్. అలాగే సినిమా కూడా 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.