English | Telugu

చేతులు మారిన ఉస్తాద్ భగత్ సింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అప్ కమింగ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ మారిపోయింది.

'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ రైట్స్ ని గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మరి సినిమా ఆలస్యమైందనో లేక నెట్‌ఫ్లిక్స్ భారీ అమౌంట్ ని ఆఫర్ చేసిందో తెలియదు కానీ.. ఓటీటీ రైట్స్ చేతులు మారాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్' స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశముంది.

పవన్ కళ్యాణ్ గత చిత్రం 'ఓజీ' రైట్స్ ని కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. 'ఓజీ'కి వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలోనే.. 'ఉస్తాద్ భగత్ సింగ్' రైట్స్ తీసుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి చూపించి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: సంక్రాంతి రన్నర్ చిరంజీవి.. మరి విన్నర్?

'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవర్ ఫుల్ పోలీస్ గా పవన్ కనిపించనున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ లో సైనికుడి పాత్రలో పవన్ కనిపించనున్నాడని సమాచారం.

Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ