English | Telugu
తేజ్ ని బుర్రతక్కువ వెధవ అని తిట్టిన ఫ్యాన్..కరెక్ట్ అన్న తేజ్
Updated : Nov 15, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నాడు. విరూపాక్ష విజయం తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. తేజ్ నటించిన పిల్ల నువ్వు లేని జీవితం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి నిన్నటితో తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకుంది.ఈ సందర్భంగా తేజ్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో చిట్ చాట్ చేసాడు. ఆ కార్యక్రమంలో ఒక అభిమాని సాయి ధరమ్ తేజ్ ని తిట్టడం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది.
ఒక అభిమాని తేజ్ తో మీరు ఇంతవరకు చేసిన సినిమాల్లో ఏ సినిమాలు మీకు బాగా సంతృప్తినిచ్చాయని అడిగాడు. అభిమాని అడిగిన ఆ ప్రశ్నకి చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాలు నాకు బాగా సంతృప్తి నిచ్చాయని తేజ్ బదులు ఇచ్చాడు. కానీ తేజ్ పొరపాటున రిపబ్లిక్ స్పెల్లింగ్ ని రిలబ్లిక్ గా పోస్ట్ చేసాడు. దాంతో సదరు అభిమాని ఎలాంటి సంకోచం లేకుండా తేజ్ ని ఉద్దేశించి బుర్ర తక్కువ వెధవ రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్ ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళావా అని ఘాటుగా ప్రశ్నని సంధించాడు. కానీ తేజ్ మాత్రం చాలా సాఫ్ట్ గా తన అభిమానికి రిప్లై ఇచ్చాడు. స్పెల్లింగ్ తప్పు నిజమే కానీ నేను స్కూల్ కి వెళ్ళాను కాకపోతే మా స్కూల్ లో నాకు గౌరవం నేర్పించారు. మరి మీ స్కూల్ లో నీకు నేర్పించారా అని తేజ్ సదరు అభిమాని సిగ్గుపడేలా బదులు ఇచ్చాడు. దీంతో వెంటనే సదరు అభిమాని సారీ అన్న నేను మీరు రిప్లై ఇవ్వరని అలా సరదాగా పోస్ట్ చేశాను అని చెప్పుకొచ్చాడు.తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం లో గాంజా శంకర్ అనే ఫుల్ మాస్ మూవీ ని చేస్తున్నాడు.